Alisetty
Barely two years younger
My brother;
Always thought I had
Elder brothers or elder sisters only
Felt bad about not having
Younger siblings
Only now did I realize
People like you, with pure
Kind hearted souls too
Wandered on this earth
Came to know this about
Five or six years ago!
It’s not your fault,
Probably it’s due to society’s fault
The world’s dimensions (communication distances)
Did not shrink due to globalization
Yet, people’s living quarters
Did get diminished (in number)
Dwelling areas got shrunk drastically
Sentiments and thoughts
Aren’t broad any more
In ’76 I started my poems
And mini-poems
Then there were no shirts
Of “minis” and “nanis” (micros?)
Even if there were any
I did not know about them in Delhi
You repented for not bestowing
Ten grams of gold –
Alas, has the yellow (metal) color
Become so scarce in Bhagyanagar?
No, there is no
Anguish in Alisetti’s face
Dear Telugu brother! Do not fret
A bit –
Poets write, not for
Revolution, not for
Quenching the pangs of hunger
Not at all
Some time, a random poetic line
Created here
May stir a gentle wave of emotion
In a pretty heart somewhere
Just a (little) fond wish, that’s all
Some times that too may
Not happen at all –
Thus quipped the Great Poet Kalidasa
(Gently chided the sensitive artist)
Long back!
అలిశెట్టి
రెండేళ్ళు మాత్రమే చిన్న
నా తమ్ముడు
ఎప్పుడూ నాకు అన్నలు, అక్కలు
ఉన్నారని, చిన్నవాళ్ళు లేరే అని
తలపోసేవాణ్ణి
ఇప్పుడిప్పుడే నీలంటి
స్వఛ్ఛ హృదయాత్మలు కూడా ఈ భూమ్మీద
తిరుగాడారని, మొన్న మొన్ననే
అయిదారు ఏళ్ళముందు తెలిసింది -
తప్పు నీది కాదు, ఒక విధంగా
సమాజానిది (ప్రపంచీకరణతో)
ప్రపంచం కొలతలు ఏమీ తగ్గలేదు
కాని, జీవులు బ్రతకడానికి స్థలాలు తగ్గాయి
స్థలాల విస్తీర్ణాలు మరీ కుంచుకు (కృంచుకు) పోయాయి
భావాలు, ఆలోచనలు విశాలంగా లేవు
నేను ‘76 లోకవితలు, మినీ కవితలు
మొదలెట్టాను, అప్పుడు “మినీ, “నానీల”
చొక్కాలు లేవు
ఉన్నా ఢిల్లీ (దిల్లీ ) లో ఉన్న నాకు తెలియ లేదు
ఒక తులం బంగారం ఇవ్వలేదని పరితపించావా?
భాగ్యనగరంలో పచ్చరంగు అంత ప్రియమైయిందా?
అలిసెట్టి ముఖములో
అలజడ లేదు
అనుంగు తెనుగు సోదరా! ఒకింతయు చింత వలదు
కవులు వ్రాసేది - క్రాంతి పథము
వస్తుందని కాదు, కడుపులో మంట చల్లార్చటానికి కాదు, కాదు
ఎప్పుడో ఎక్కడో ఓ చక్కని ఎదలో
ఇక్కడ వ్రాసిన కవిత, ఓ పదము
అక్కడ ఎదలో ఒక లలిత
భావ తరంగాన్ని చెలరేపుతుందని
ఒక చిన్ని ఆశ. అంతే
అదికూడా ఒకప్పుడు
జరగక పోవచ్చు -
అని మహాకవి కాళిదాసు
సున్నితముగా ఎప్పుడో
వక్కాణించారు! (Copyright 2020, both by the author)
(I penned the Telugu original first and then the English translation followed. Both poems were first posted at my blog at Sulekha. Alisetty Prabhakar needs no introduction from me. I feel unconsolably sad whenever I hear poets succumbing to TB or any other "curable/manageable" disease. In England John Keats was one such unlucky creative extraordinaire, plucked out at an early age. Alisetty's portrait photo radiates the life of a "consummate artist". This short poem is a modest homage to the Telugu brother.)
No comments:
Post a Comment