శాకాహార మాధురి
- (అత్రి)
హంగుగా శీతానుకూల బూత్ లో
హంబర్గర్ కొరికే సైబర్ ధీరునకేం తెలుసు?
మర్రి చెట్టుక్రింద మల్లన్న చేతి
పచ్చి మిర్చి బజ్జీల రుచి?
సందెటేల తాగి తొంగే
కుష్వంత్ సింగ్ కేమెరుక? గుంటూరు
దొడ్డమ్మ గోంగూర పచ్చడి మజా?
నీకు నాకూ - వైష్ణవ గుడిలో నోరూరే
ఆకర్షణ..
పులగం.. అదొక్కటేనా?
కనువిందుల కన్నెల కనుబొమ్మలు నిండే ధనుర్మాసం
పిట్సుబర్గ్ పొడుగునామాల వాడి వేడి ప్రసాదం
మరి ఆ మహాకవికి -
"రవికిప్పేసి భర్తతో కులికే
శృంగారపు పెసరపప్పు"
సన్నబియ్యము - నారికేళ పాయసపు
మహదానందం, దాని వర్ణన శ్రీనాధునికే తగు
సూలూరుపేట రైల్వే కూలీలు తృప్తిగా తిను
ఆవకాయి చల్దన్నము తీపి
ఆ గొల్ల పడుచుల మిత్రుడు కృష్ణునికే తెలుసు
చలికొరికే ఉత్తర అమెరికాలో నైనగాని
కాళ్ళుకాలే దక్షణ భారత కుగ్రామములో గాని
జగమెల్ల ఈ ధరయిత్రిలో అత్రి
సత్కవుల్ శాకాహారులైననేమి? తోటకాపులైననేమి?
చంద్రశేఖర్వేంకటాది సుశాస్త్రజ్ఞుల్ దధి
ప్రియులైననేమి? తువరికా పాచకులైననేమి?
copyright by the author (atri) 2009
No comments:
Post a Comment