స్వప్నిక
ఏ సుందర ప్రేమానురాగాల ఊయలలో
ఏ మధుర స్వప్న సుందరిగా పుట్టావో
పట్టుమని పదిహేను సంవత్సారాలైనా
నిండుగా ఆనందించలేదేమో
ఎక్కడికి వెళ్ళిపోయావు?
వ్యాఘిరాలా ఏ ఏరులోకి వెళ్ళిపోయావు?
లూసీ గ్రే చిట్టడుగులు కనిపించాయి ఆనాడు
నీ జాడలు ఇప్పుడు
ఏ వీధుల సందులలో చూసేది?
ఆనాడు ఆమ్లములు క్షారములు అంటే
రసాయినిక ప్రయోగశాల
ఈనాడు ... ...
ఇదేనా నా రుద్రమ దేవి, మొల్ల జనించిన
తెలుగు గడ్డ ఇదేనా?
మళ్ళీ జన్మంటూ వుంటే
నీకు - నాకూ
రా మా ఇంట్లోకి - 'దివిలో విరిసిన పారిజాతంలా'
దత్తతైనా చేసుకొంటా
మోనకో రాకుమారిలా చూసుకొంటా
ఉంచుతా నిన్ను
అపరిపక్వ మూర్ఖ మగ జల్సారాయలకి దూరంగా
సుదూరంగా ఒక స్వర్గతుల్య కోనసీమ ద్వీపంలో
సహృదయుల పొరిగింట పెద్దల సంరక్షణ చూపుల డోలలో
- అత్రి
Copyright 2009
(December 31, 2011 is the tragic third anniversary of Swapnika)
No comments:
Post a Comment