Monday, January 18, 2021

Lyrics of a Kshetrayya Song "Mundati vale"


రాగము: భైరవి 

తాళము: త్రిపుట (ఆట)


ముందటి వలె నాపై నెనరునున్నదా? నా సామి?

ముచ్చటి లిక నేలరా?

ఎందుకు మొగ మిచ్చకపు మాట లాడేవు

ఏరా మువ్వగోపాల - మేరగాదురా? నా సామి?


పిలువనంపిన రావు - పిలిచిన గైకోవు

పలుమారు వేడిన - పలుకవు

వలపు నిలుప లేక - చెలువుడవని నిన్నే (నిన్ను)

తలచి తలచి చాలా - తల్లడిల్లుటే కాని |ముందటి|


చిన్ననాటినుండి - చేరిన దెంచక

నన్ను చౌక జేసేది - న్యాయమా?

వన్నె కాడ నీదు - వంచెన లెరుగనా

నిన్నన బనిలేదు - నే జేసిన పూజకు    |ముందటి|


కలువల రేడంచు కంచి - వరదా నిన్నా

లలనా యింత దూరము - రానిచ్చేనా

అలరు విల్తుని కేళి - నలము కొనుచు నన్ను

కలిసిన పాపానికి - కన్నుల జూడ వచ్చితివో 


mundaTi vale naapai nenarununnadaa? naa saami?

muccaTi lika nElaraa?

enduku moga miccakapu maaTa laaDEvu

Eraa muvvagOpaala - mEragaaduraa? naa saami?

piluvanampina raavu - pilichina gaikOvu

palumaaru vEDina - palukavu

valapu nilupa lEka - cheluvuDavani ninnE (ninnu)

talachi talachi chaalaa - tallaDilluTE kaani |mundaTi|

chinnanaaTinunDi - chErina denchaka

nannu chauka jEsEdi - nyaayamaa?

vanne kaaDa niidu - vanchena leruganaa

ninnana banilEdu - nE jEsina puujaku    |mundaTi|

kaluvala rEDanchu kanchi - varadaa ninnaa

lalanaa yinta duuramu - raanicchEnaa

alaru viltuni kELi - nalamu konuchu nannu

kalisina paapaaniki - kannula juuDa vacchitivO 


(Here is the link for a video of this song: https://www.youtube.com/watch?v=pwR5MPIH4IM)




No comments: