శివ నామము, శివ శివ నామము
నను దరి చేర్చేనా ఈ క్షణమూ
గంగను చేరితి తండ్రి పనుపున
మణికర్ణఘాటు పదముల నిలిచితి
పావన గంగా స్నానమాడక
మరలిపోతినే మందబుద్ధినై || శివ ||
పలుమఱు నేను పరుగు పరుగున
వేయి యోజనముల యాత్రలు సల్పితి
ఒక క్షణమైనా నీ వాయులింగపు
ద్వారము కడ నిలువ నైతిని - శివ శివ
ఒక క్షణమైనా నీ కాళహస్తి
గోపురశిఖరము చూడనైతి || శివ ||
కొండలు కానలు నే నడువలేను
నీ తీర్ధక్షేత్రముల దరిచేరజాల
నీవే దయతో నను చేరరావా
ముద్దుల ఉమతో నాట్య మాడవా
సదా సాంబవై నాయెద నిలువవా? || శివ ||
© copyright 2015
Siva naamamu, Siva Siva naamamu
nanu dari cErchinaa ii kshaNamuu
ganganu cEriti tanDri panupuna
maNikarNaghaaTu padamula niliciti
paavana gangaa snaanamaaDaka
maralipOtinE mandabuddhinai
paluma~ru nEnu paruguparuguna
vEyi yOjanamula yaatralu salpiti
oka kshaNamainaa nii vaayulingapu
dwaaramu kaDa niluva naitini - Siva Siva
oka kshaNamainaa nii kaaLahasti
gopuraSikharamu cuuDanaiti
konDalu kaanalu nE naDuvalEnu
nii tiirdhakshEtramula daricErajaala
niive dayatO nanu cEraraavaa
muddula umatO naaTya maaDavaa
sadaa saambavai naayeda niluvavaa?
(English transliteration generated by Lekhini)
No comments:
Post a Comment