తోడి రాగము, చాపు తాళము
రామ దైవశిఖామణి సురరాజ మనోజ్వల భూ(షా) మణి || రామ ||
తామర సాక్ష సుధీమణి భవ్య తారక భక్త చింతామణి || రామ ||
నాడే మిమ్ము వేడుకొంటిగా శరణాగత బిరుదని వింటిగా
వేడుకై మిము (పొ)బొడ గంటిగా నన్ను దిగవిడనాడ వద్దంటిగా || రామ ||
చింతసేయగ నేమిలేదుగా ముందు చేసిన గతి తప్పబోదుగా
ఇంతకు మిక్కిలి రాదుగా నే నితరుల (గొ)కొలిచేది లేదుగా || రామ ||
తమ్ముడు నీతో జంటను (నీతో ఒక్క కంటను) రామదాసుని రక్షింప కుంటెను
సమ్మతి నుండు మాయింటను భద్రాచల వాస నీ బంటు బంటను || రామ ||
tODi raagamu, chaapu taaLamu raama daivaSikhaamaNi suraraaja manOjvala bhoo(shaa) maNi || raama || taamara saaksha sudheemaNi bhavya taaraka bhakta chiMtaamaNi || raama || naaDae mimmu vaeDukoMTigaa SaraNaagata birudani viMTigaa vaeDukai mimu (po)boDa gaMTigaa nannu digaviDanaaDa vaddaMTigaa || raama || chiMtasaeyaga naemilaedugaa muMdu chaesina gati tappabOdugaa iMtaku mikkili raadugaa nae nitarula (go)kolichaedi laedugaa || raama || tammuDu neetO jaMTanu (neetO okka kaMTanu) raamadaasuni rakshiMpa kuMTenu sammati nuMDu maayiMTanu bhadraachala vaasa nee baMTu baMTanu || raama ||
No comments:
Post a Comment