Tuesday, October 20, 2020

Yellow Stem (Poem with Telugu Original)

పసిడి కొమ్మ (Yellow Stem)


వచ్చింది, వచ్చింది 

పసిడి వన్నెతో

పసుపు కొమ్మ 


కొమ్మల మాదిరి, ముద్దు గుమ్మల 

గుంపుల ఒంపుసొంపులతో 

జడ కుచ్చులు వేళ్ళాడుతూ 

మా అమ్మ పిన్నమ్మ రోజుల్లో 

ఉండియుంటే 

అక్కడివి పండియుంటే (పెరిగితే) -

అమ్మ 

వేసేది మా అక్కకు జడలో గుచ్చి గుచ్చి 

రంగు రంగుల పూల వరుసలు

దివిలో ప్రత్యక్షమైయ్యేది 

నడిచే నందనవనం!

రెండు మూరల కుసుమాల  

కొమ్మ!


తెనుగులో ఏమనాలి నిన్ను?

కలువపూల  కత్తి?

పుష్ప ఖడ్గము?


అంతర్చక్షువులుండాలే గాని 


జగత్తులో అందానికి కరువేది?

కీట్సు, కృష్ణశాస్త్రి, నాలాంటి కవులకు


ఒకప్పుడు మా తోటలో 

ఉండేవి ముప్ఫై కత్తి పూలు 

మూడు నాల్గు మెట్టతామరలు  

రెండు రంగుల సుగంధ  

ఐరిస్ పూలు


ఇప్పుడు  

పసిడి రంగుల 

కత్తిపూలు తెచ్చాయి 

ఒక అపురూప అనుభూతి 

ఒక వారము నా ముందు 

చిమ్నీ దగ్గర ముద్దుల స్నేహితురాలుగా 

నవ్వుతూ ఉంది బుల్లి కూజాలో 

రోజుకో పచ్చల రవిక విప్పుతూ!  (Copyright 2018 by the author)


Yellow Stem


It’s come, come

With soft golden sheen

One yellow stem

 

Like ebullient damsels with

Graceful curves and

Long braids, with swinging tassels

 

If only …

Had these been available

If only …

They were bred

During my mother’s and aunt’s yonder days

 

Mother would’ve decorated

My sister’s oily braid

With rows of colorful

Florets

Then we’d have gotten a walking

Heavenly garden on earth!

Two cubits of floral stem!

 

What should I call you

In Telugu?

Sword of lilies?

Floral blade?

 

For poets like Keats,

Krishnasastri, and myself

Where is the dearth of beauty

In this world?

Only one needs the inner eye

 

Once we used to have

Thirty gladioli, three four cannas,

And a pair of scented irises

In our garden


Now this golden colored

Gladiolus gifted me

An indescribable feeling

For almost a week

It stayed fresh in front of me

Near the fireplace like a lovely

Smiling lady companion

Seated in a tiny vase

Disrobing the green blouses

One a day!

(Copyright 2020 by the author)

 


No comments: