Showing posts with label original Telugu song. Show all posts
Showing posts with label original Telugu song. Show all posts

Tuesday, December 8, 2020

Lyrics of "e peruto ninu" - Original Devotional Song

ఏ పేరుతో నిను పిలిచెదనో
ఏ రూపమున నిను కొలిచెదనో, సాయి
తెల తెల్లని నవ తామరలతో
నిత్యము వెలిగే నీ ద్వారములు  |ఏ పేరుతొ| 

1. చిన్ని చిన్ని వరములు, చిల్లర కోర్కెలు
అంతములేని మా ఆవేదనలు
నిమిసమైనా మది నిలకడ నొసగే
చల్లని నీ కృపయే కాదా 

2. కలిమిలేముల కష్టపు బ్రతుకులు
దినదిన గండపు దీర్ఘాయువు
ప్రారబ్ధమో లేక పరుల శాపమో యిది
రోగ పీడిత తనువులు మావి
ఖండ ఖండములలో తల్లడిపోయే
అగణిత కోటి ఈ జీవరాసులు
మరువకు మరువకు మరి మమ్ములను
మరువకు సుమా నీ దాసులము 

3. (నా) జపములు తపములు వ్యర్ధములా
స్వచ్ఛపు హృదయమె నిను కనుగొనునా
నిను చేరుటకై తపనేల
నిష్ఫల యత్నము సేయనేల
(నా) సాధన సంగీత కవితలెల్ల
నీ మహిమల సుమ నిహారమె కాదా

ae paerutO ninu pilichedanO

ae roopamuna ninu kolichedanO, saayi

tela tellani nava taamaralatO

nityamu veligae nee dvaaramulu  |ae paeruto| 


1. chinni chinni varamulu, chillara kOrkelu

aMtamulaeni maa aavaedanalu

nimisamainaa madi nilakaDa nosagae

challani nee kRpayae kaadaa 


2. kalimilaemula kashTapu bratukulu

dinadina gaMDapu deerghaayuvu

praarabdhamO laeka parula SaapamO yidi

rOga peeDita tanuvulu maavi

khaMDa khaMDamulalO tallaDipOyae

agaNita kOTi ee jeevaraasulu

maruvaku maruvaku mari mammulanu

maruvaku sumaa nee daasulamu 


3. (naa) japamulu tapamulu vyardhamulaa

svachChapu hRdayame ninu kanugonunaa

ninu chaeruTakai tapanaela

nishphala yatnamu saeyanaela

(naa) saadhana saMgeeta kavitalella

nee mahimala suma nihaarame kaadaa


(When I get a chance I will record the song and upload it to my YouTube channel. Still, people can add their own tune and utilize it as a bhajan song. It suddenly came to me out of a sudden inspiration. Obviously there are many beautiful, moving, and profound devotional songs on the Guru. Hope people will add this to their repertoire of devotional songs. Years ago I posted the lyrics at Sulekha, if I remember correctly. English translation will be given in the next post here. Copyright 2020 by the author.) 

Sunday, February 2, 2014

A Telugu Song on Devi - Original Composition


కనకదుర్గమ్మ పై ఓ చిన్ని పాట  

జగములనెల్ల నీవే యుండ (నిండ),
నిలువదు నామది ఎందులకు? 

నడిచి నడిచి నే నలిసి పోతినో
నీ పదనూపుర పుర వీధులలో
బాలుడనై నే తిరుగలేదా నీ పతిదేవుని ప్రాంగణములలో

చల్లని తల్లి నీ కరుణ నాకుండగ
ఎందుకు నాకీ తపనలు మాతా?

మరులొలికే నుని మందార కపోలములో అవి
(అరుణోదయ నుని మందార కపోలములో)
నవ పారిజాత నఖ కాంతులో మరి
యోగులకైనా తెలియ శక్యమే 
నా తరమా నీ కవనము సేయ  

jagamulanella niivE yunDa (ninDa)
niluvadu naamadi endulaku?
Ho
naDichi naDichi nE nalisi pOtinO
nii padanUpura pura viidhulalO
baaluDanai nE tirugalEdaa nii patidEvuni praamgaNamulalO


callani talli nii karuNa naakunDaga
enduku naakii tapanalu maataa?

marulolikE nuni mandaara kapOlamulO avi
(aruNOdaya nuni mandaara kapOlamulO)
nava paarijaata nakha kaantulO avi
yOgulakainaa teliya SakyamE 
naa taramaa nii kavanamu sEy

I will give the audio clip and English translation in a future post. విజ్ఞులు తప్పులున్న క్షమించెదరు గాక. Copyright by the author 2013.