Saturday, June 10, 2017

Lyrics of "endaro mahanubhavulu"

రాగం: శ్రీరాగము              ఆదితాళము

ప. ఎందరో మహానుభావులు అందరికి  వందనములు |ఎం|
చందురు  వర్ణుని అంద చందమును హృద యార
విందమున (జూచి బ్రహ్మానంద మనుభవించువారు |ఎం|

సామగానలోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులు  

మానస(వనరుహ)  వనచర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనేవారు |ఎం|

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారు

పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును,
సల్లాపముతో స్వర లయాది రాగముల తెలియువారు

హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్త కోటు లిలలో తెలివిలో(తో) చెలిమితో(
గరుణ గల్గి జగమెల్లలను సుధా దృష్టిచే(బ్రోచు వారు

హొయలు మీర నడలు గల్గు సరసుని
సదా గనుల( జూచుచును, పులక శరీరులయి ముదంబునను యశముగలవారు
పయోధినిమగ్ను లయి ముదంబునను యశముగలవారు

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన దిగీశ
సుర కింపురుష కనక కశిపుసుత నారద తుంబుర పవనసూను
బాలచంద్రధర శుక సరోజభవ భూసురవరులు పరమపావనులు
ఘనులు శాశ్వతులు కమల భవ సుఖముదానుభవులు తామె  

నీ మేను నామ వైభవములను నీ పరాక్రమ ధైర్యముల శాంత మా
నసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు
జనించకను దుర్మతములను కల్ల( జేసినట్టి నీమది
నెఱిoగి స(o)తతoబునను గుణ భజనానంద కీర్తనము జేయువారు

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్
శివాది షణ్మతముల గూఢముల ముప్పది ముక్కోటి సురాంత
రంగముల భావముల నెఱిఁగి భావ రాగ లయాది సౌఖ్యముచే
జిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన వారు

ప్రేమము పెరిగొను (పేరుకొను)  వేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని(కి) నిజ దాసులైన వారెందరో

raagaM: Sreeraagamu aaditaaLamu pa. eMdarO mahaanubhaavulu aMdariki vaMdanamulu |eM| chaMduru varNuni aMda chaMdamunu hRda yaara viMdamuna (joochi brahmaanaMda manubhaviMchuvaaru |eM| saamagaanalOla manasija laavaNya dhanya moordhanyulu maanasa(vanaruha) vanachara vara saMchaaramu nilipi moorti baaguga poDaganaevaaru |eM| saraguna paadamulaku svaaMtamanu sarOjamunu samarpaNamu saeyuvaaru patita paavanuDanae paraatparuni guriMchi paramaardhamagu nija maargamutOnu baaDuchunu, sallaapamutO svara layaadi raagamula teliyuvaaru hariguNa maNimaya saramulu gaLamuna SObhillu bhakta kOTu lilalO telivilO(tO) chelimitO( garuNa galgi jagamellalanu sudhaa dRshTichae(brOchu vaaru hoyalu meera naDalu galgu sarasuni sadaa ganula( joochuchunu, pulaka Sareerulayi mudaMbunanu yaSamugalavaaru payOdhinimagnu layi mudaMbunanu yaSamugalavaaru parama bhaagavata mauni vara SaSi vibhaakara sanaka sanaMdana digeeSa sura kiMpurusha kanaka kaSipusuta naarada tuMbura pavanasoonu baalachaMdradhara Suka sarOjabhava bhoosuravarulu paramapaavanulu ghanulu SaaSvatulu kamala bhava sukhamudaanubhavulu taame nee maenu naama vaibhavamulanu nee paraakrama dhairyamula SaaMta maa nasamu neevulanu vachana satyamunu raghuvara neeyeDa sadbhaktiyu janiMchakanu durmatamulanu kalla( jaesinaTTi neemadi ne~riogi sa(o)tataobunanu guNa bhajanaanaMda keertanamu jaeyuvaaru bhaagavata raamaayaNa geetaadi SRti Saastra puraaNapu marmamulan^ Sivaadi shaNmatamula gooDhamula muppadi mukkOTi suraaMta raMgamula bhaavamula ne~ri@Mgi bhaava raaga layaadi saukhyamuchae jiraayuvul^ galigi niravadhi sukhaatmulai tyaagaraaptulaina vaaru praemamu perigonu (paerukonu) vaeLa naamamunu dalachaevaaru raamabhaktuDaina tyaagaraajanutuni(ki) nija daasulaina vaareMdarO   

(These lyrics have been compiled after listening to Padma Vibhushan Dr. Balamuralikrishna, Padmasri Chittoor Nagayya, and Bharatratna M.S. Subbulakshmi. I have also verified each word from the songs book edited by Mutya Syamasundari. Though the transliterated English version is given, it is better for the reader to learn diligently the Telugu script, the aspirated consonants, and phrases; this is essential to convey the correct meaning and context for every word. It also helps and intuitively guides the singer where to pause, where to emphasize, and aids in correcting immediately any inadvertent errors that may creep in a long song. Knowing the full meaning of the song is a must, there are no shortcuts here. Only great singers and composers like Dr. Balamuralikrishna can impart the ‘exquisite bhava’ while rendering this unique Tyagaraja kriti. Because they know the song’s total meaning. Each phrase is like a manasa-sarovara (మానస సరోవరము) and there are many here. Explanation will be given in a future post.)