Sunday, March 4, 2018

Brittle Leaves (ఎండు టాకులు)


ఎండు టాకులు
అల్ల
దూరంలో కొన్ని ఎండుటాకుల గుత్తులు
నగ్నపు అక్రోటు, మేపిల్, సింధూర, సీమచింత …
కొమ్మల నుంచి వెళ్ళాడు తున్నాయి
మా పడక గది గాజు కిటికీలోంచి కనిపిస్తాయి
నాకు.
ఎన్నో సార్లు ఆలోచించాను
ఎందుకు, ఇంకా ఇప్పుడు
తల్లి చెట్టుని పట్టుకొని
వెళ్లాడటం, ఎందుకింకా?
ఉపయోగితా మభ్య భరిత
ఆధునిక మానవ దృష్టిలో -
వీటి వల్ల ఏం లాభం?
ఇక్కడ, ఈ హేమంతంలో చలికి
చెట్లు (ఆకులకి) తేమ ద్రవాలు
నిలిపేస్తాయి, అంతే ఓ రాత్రి
వణుకే చలికి ఆకులన్నీ తమ తమ
రంగు రంగుల లోదుస్తులు
చూపిస్తాయి; ఈ దుర్భర చలిలో
ప్రేమతో తల్లికి తోడుంటాయి
పగిలి ఎండిపోయిన బెరుడులతో కప్పిన
చాలీచాలని ఆఛ్చాదము - చాలు
ఈ ఒక్క దృశ్యము, ప్రపంచంలోని
నికృష్ట నిస్సహాయ దారిద్ర్య దష్ట
నగ్న మానవాకృతి కాల బిలం స్ఫురించడానికి
చాలీచాలని ఆఛ్చాదనముతో -
ఈ చెట్లతో ఎవరు మాట్లాడుతారు?
ఇప్పుడు ఎవరు పలకరిస్తారు?
ఈ కాల జలద భరిత శీతల
అతి దారుణ చలిలో ఎవరు చెప్పు?  
కాదు, ప్రకృతి మనమూహించినంత
క్రూరురాలు కాదు
ఇప్పుడూ
ఈ చెట్లకి అతిధులు వస్తారు
(ఆకలితో) లేళ్ళు, బొచ్చు తోకల ఉడుతలు,
నీలి పిట్టలు, చికడీలు (తీతీ పిట్టలు), తొలిచే
వడ్రంగి పిట్టలు,
బొద్దు కాకులు, గువ్వలు, ఒక్కక్కప్పుడు
పెన్నడ పులుగు - కాని ఈ తీవ్ర చలిలో కూడ
ఈ ఎండుటాకులు
చెట్లతో రహస్యాలు మాట్లాడుతాయి!
ముసిముసి గుస గుసలు
చూస్తుంటే ప్రతీ గాలి హృదయ తరంగాలు
ఈ ఆకుల వీవనలకు చెప్తుంటాయి
ఏ సూక్ష్మ గాలి రాకపోకడలైనా సరే  
చెప్పకుండా వీటిని దాటి వెళ్ళ లేవు
అతి సున్నితపు అణు బల ముల్లు లాగ
పనిచేస్తాయి ఈ మేపిల్ ఎండుటాకుల మొనలు
దూరంనుంచి నాకు వినిపించవు
కొన్ని సన్న ధ్వని తరంగాలు,
ఈ పిల్ల గాలుల ఈల పాటలు
కాని (ఈ) ఎండు టాకుల చిన్ని చిన్ని
విసినకఱ్ఱలు, ఆ దిగువున నిరంతర
పారే జలపాతము, మనోజ్ఞ శాంతిలో
ఓలలాడే వనము.. మెరిసే హిమాపు తెరల్లోంచి  
ఇస్తాయి ప్రతి ప్రొద్దు
ఆనందము మాకు; నూత్న కొంగ్రొత్త
అనుభూతుల ఖని ఇది నాకు
ఎండి చచ్చి పోయాయి అనుకొంటాము
ఈ ఆకులు, కాని ఇప్పుడు ఎంతో
జీవముట్టిపడి పలకరిస్తాయి
ఓ రోజు వీటితో గర్భిత ఉడుతలు ఇల్లు
కాదు, గూడు కట్టుకొంటాయి
వీటిలో కాలాతీత ప్రాణము
నా ఊహల కందని జీవము
ఎల్లప్పుడూ అలరారును.   Copyright 2018 by the author

(This was initially posted at Sulekha. At times I wonder whether I still have the same grip on my mother tongue Telugu despite being away from the Telugu land. Originally I wrote the poem in English titled as "Brittle Leaves". In this Telugu translation I tried to bring forth the original emotion, thoughts, and good bit of fidelity. Due to the bitter cold, winter is sometimes harsh; but there is always more meaning and beauty in nature. I have only attempted to catch a minuscule of that enormous splendor!)       
     

   

Friday, February 16, 2018

English Translation of "Pahi Rama Prabho" Song

-->
This is only a partial translation of the song. Mostly if not always the prospective (Kuchipudi and Bharatanatyam) dance choreographer or vocalist need to know the meaning of each word distinctly. Within certain bounds (‘cause you cannot find the exact English word) I will try to attempt to provide a faithful comprehensive meaning of this exquisite composition; in hundred twenty lines (more like stanzas) the venerable bhakta Ramadasu pours out his soul and heart, urging Lord Rama for a speedy rescue.

Save (me), O Lord Rama
Save (me) O Lord of the Bhadra Mountain (Bhadrachalam)
The Lord of Sita (of Videha kingdom)

Where will I see your beatific form?
Seated in the lotus-like heart of Indira (Sita)
(When) will I feel your exquisite bliss
(When) Will I glance it to the joy of my eyes

Ah, what a pleasure it would be to
See your feet adorned with Tulasi (sacred Basil)
By the gods and other devotees
You’re the mother, you’re the father
You are our benefactor
And you are our (elder) brother

How come your arrows
Do not trouble and pierce
My enemies?
I keep on arguing thus
“You are the One at the
Beginning, middle, and end.
You are the Atman – that dwell
Inside as well as outside”
O Lord of the Universe

I keep on uttering
Repeatedly your excellent Sri Rama mantra
With wonder
O Rama, my mind yearns only
For the essence of Your name,
My mind wants to drink
The ambrosia of Your name

In the Kali-yuga you’ve taken
The form of Kalki;
(For us) You reside on the Bhadra Mountain
By thinking (meditating) about you, your imperishable quality
Your Manifestations (Forms, Avataras)
The rishis (devotees) have become gods

O Rama of Bhadrachalam
Save (me), Sri Rama
Please take care of those
Who seek shelter at your lotus-like feet.

Copyright 2018 by the author
(Telugu lyrics were given in the previous post here)

Thursday, February 1, 2018

Lyrics of "Pahi Rama Prabho" Kirtana

పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో


ఇందిరా హృదయార విందాధిరూఢ సుందరాకార నానంద రామ
ఎందునేజూడ మీ సుందరానందమును కందునో కన్నులింపొంద శ్రీ రామ


బృందారకాది బృందార్చిత  పదారవిందముల(నీ) సందర్శితానంద
తల్లివి నీవె మా తండ్రివి నీవె మా దాతవు నీవు మా భ్రాత రామ ప్ర ||


నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి బాధింపుకున్నా వదేమి రా
ఆది మధ్యాంత బహిరంతరాత్మ డనుచు వాదింతునే జగన్నాధ రామ  


శ్రీ రామ రామేతి శ్రేష్ట మంత్రము సారె సారెకును వింతగా జదువ రామ    
శ్రీ రామ నీ నామ చింత నామృత పాన సారమే నాదు మదిగోరు రా


కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలిసితివి భద్రాద్రి నిలయ రా
అవ్యయుడవైన నీ యవతారముల దలచి (వలన) దివ్యులైనారు మునులయ్య రా


పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల పాలింపు మా భద్ర శైల రా
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో


నాదనామ క్రియా రాగము
ఏక తాళము

(Several years back, an Internet acquaintance requested this song and its meaning. Regrettably it took this long to post this famous Ramadasu song. Making a promise is one thing, but keeping it timely is another thing. Better late than never, as the saying goes! Hopefully I will be able to write about its meaning sooner. The original song has almost 120 lines. I just followed the rendition by Dr. Balamurali Krishna.)

Wednesday, January 24, 2018

Lyrics of "antalone tellavare" Song

అంతలొనే తెల్లవారే 
అయ్యో ఏమి చేతునే
కాంతుని మనసెంత నొచ్చెనో  
ఇంతీ ఎటు సైతునే  

కొంతసేపు ప్రియము లాడి
చెంతచేరి చేజాపి
దోరవయసు  నా సామి దొంతర విడెమందుకొనె  

చెక్కిలిపై కొనగోటితో ఒక్కసారి కొసరలేదు    
మక్కువుతో గోపాలుడు  
కొంత పరిహాసమాడు నంతలోనే  

antalonE tellavaarE 

ayyO Emi cEtunE
kaantuni manasenta noccenO  
intI eTu saitunE  

kontasEpu priyamu laaDi
centacEri cEjaapi
dOravayasu  naa saami dontara viDemandukone  chekkilipai konagOTitO okkasaari kosaralEdu    
makkuvutO gOpaaluDu  
konta parihaasamaaDu nantalOnE  
kaantuni manasento noccino  [This dance item (జావళి) is from the Telugu movie, 'Muddu Bidda'. Music was directed by Pendyala Nageswara Rao. As yet I cannot verify the composer; was it penned by Kshetrayya?

I am posting the lyrics here upon a request by a reader (J.S.).  The lyrical poem brings into focus the plight of a lover, the distress felt by the lady. Time is always a premium for lovers, poets, creative individuals, and even saints. One night, just twelve hours of moonlight is awfully short for a couple. Barely lovers get to know each other in such a short duration, suddenly the daybreak happens, and the lady feels the pain of separation. In a few minutes, this song concentrates the transaction between the couple and brings to the viewer a night's act: A joyous meeting with Gopala (Krishna). How simple, yet so rich in romance these playful acts! They talked about sweet nothings, touched each other's hands, and shared several pans (కిళ్ళీ, తాంబూలం). She protests thus: "He did not scratch my cheek even once.  Before he could humor me, play jokes, lo the night is over. Alas." 

This is what we call really 'Fine arts' (లలిత కళలు).]   

Wednesday, November 8, 2017

Lyrics of "Mokshamu Galada"


సారమతి రాగము ఆది తాళము (దేశాది తాళము)

మోక్షము గలదా భువిలో
జీవ-న్ముక్తులు కాని వారలకు

సాక్షాత్కార నీ సద్భక్తి - సంగీత జ్ఞాన విహీనులకు


ప్రాణానల సంయోగము వలన (వల్ల)
ప్రణవనాద(ము) సప్తస్వరములై  బరగ
వీణా వాదన లోలుడౌ శివ మనో
విధ మెఱుఁగరు త్యాగరాజ వినుత

mOkshamu galadaa bhuvilO jeeva-nmuktulu kaani vaaralaku saakshaatkaara nee sadbhakti - saMgeeta j~naana viheenulaku praaNaanala saMyOgamu valana (valla) praNavanaada(mu) saptasvaramulai baraga veeNaa vaadana lOluDau Siva manO vidha me~ru@Mgaru tyaagaraaja vinuta

(First respects to many: Parents, particulary the gifted original vocal singer - our mother. Then there are a number of Carnatic music stalwarts, from Dr. Balamurali, Maharajapuram, Balakrishna Prasad, GNB, and extraordinary vocalists like Ghantasala, P. Susheela, and P. Leela and many others. In one way or other, they’ve helped me a lot, they made me realize my own inner voice and recognize the faults in lyrics. I must also pay my debt to the great music directors like S. Rajeswara Rao, Nagendra, Aswathama, Ramesh Naidu, etc. Through out my high school and college years, my neighborhood reverberated with rich sound; there was plenty of noise from traffic, blaring movie songs played from theaters, and the rich music played at marriage ceremonies and street processions. They troubled me during my annual summer exams and yet times we students lamented our plight for the lack of “a suitable noise police”. But looking back I could not ask for a more indulgent music teacher. Hundreds of sweet melodies, haunting tragic pathos filled emotional slow moving songs, and exhilarating and energy filled throaty uplifting patriotic songs. All that music training was given to me as a free lunch and I just gobbled it up hungrily. I owe my native village, the coastal Andhra, and Delhi for a great exposure to all that there is in Carnatic, light music, and Hindusthani traditions. You cannot learn such a great expanse of varied music from a single teacher, paid or unpaid.)


I came to this brilliant composition through Sri Malladi Suri’s piece in Andhra Bhoomi. I will give a word-to-word meaning in a future blog here.   


Sunday, August 27, 2017

Sri Chakra Raja Simhasaneswari - Lyrics inTelugu

శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితాంబికే భువనేశ్వరి
 
అనుపల్లవి

ఆగమ వేద కలా(ళా) మయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి
నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరీ  రాజరాజేశ్వరీ
 
పలవిదమా యున్నై ఆడవూ(వుం)   పాడవూ  
పాడి కొణ్డాడు(o)  (oబ) అంబ పదమలర్ సూడవూ
ఉలగ  మురుదు ఎన్ (న్న) దగముర క్కాణవూ 
ఒరు నిలై తరువాయ్  కాంచి కామేశ్వరి

ఉళoద్రు    తిరింద ఎన్నై ఉత్తమ నాక్కి వైత్తాయ్ 
ఉయరియ పెరియోరుడన్ ఒన్రిడ క్కూట్టి వైత్తాయ్ 
నిళలెన త్తొడo మున్నూర్ క్కొడుమై  నీంగ చైదాయ్
నిత్యకల్యాణి భవాని పద్మేశ్వరి

తుంబప్పుడ తిలిట్టు తూయవ నాక్కి వైత్తాయ్ 
తొడరంద మున్ మాయం నీక్కి పిరంద పయనై తందాయ్
అంబై పుగట్టి ఉందన్ ఆడలై క్కా (సై) చైదాయ్ 

అడైక్కలం నీయే అమ్మా  అఖిలాండేశ్వరి

Sree chakraraaja siMhaasanaeSvari Sree lalitaaMbikae bhuvanaeSvari


aagama vaeda kalaamaya roopiNi akhila charaachara janani naaraayaNi
naaga kaMkaNa naTaraaja manOhari j~naana vidyaeSvaree  raajaraajaeSvaree

palavidamaa yunnai aaDavoo(vuM)   paaDavoo  
paaDi koNDaaDu(o)  (maoba) aMba(r^) padamalar^ sooDavoo
ulaga  murudu(o) en^ (nna) dagamura kkaaNavoo 
oru nilai taruvaay^  kaaMchi kaamaeSvariuLaodru    tiriMda ennai uttama naakki vaittaay^ 
uyariya periyOruDan^ onriDa kkooTTi vaittaay^ 
niLalena ttoDaoda munnoor^ kkoDumai  neeMga chaidaay^
nityakalyaaNi bhavaani padmaeSvarituMbappuDa tiliTTu tooyava naakki vaittaay^ 
toDaraMda mun^ maayaM neekki piraMda payanai taMdaay^
aMbai pugaTTi uMdan^ aaDalai kkaa Na (sai) chaidaay^ 
aDaikkalaM neeyae ammaa  akhilaaMDaeSvari


( తమిళం నా మాతృ భాష కాదు, still I can understand bits here and there and I can read bill boards and headings due to some exposure. I give the lyrics in Telugu script for the benefit of Telugu singers. I have listened to this song many times. Particularly I liked the versions rendered by Maharajapuram Santanam and Priya sisters. One or two mistakes might have crept in - and this is due to the slight difference between the spoken and written versions. At a recent dance program this song was featured and immediately I got attracted to it due to its profound meaning. It contains Sanskrit and Tamil stanzas, and of course true professionals do take extreme care in pronouncing the Sanskrit words faithfully. All such songs on the divine Mother are filled with phrases from 'Lalita Sahasranamam' (for example, see the compositions of GNB). These songs have extraordinary power when they are sung, read, or studied; they soothe a bruised heart and calm the frayed nerves. Meaning is given on the Internet. I bow humbly before the composer, Sri Agasthya.)   

Thursday, July 13, 2017

Excerpts from Uttara-Ramayana by Kankanti Paparaju

కంకంటి పాపరాజు “ఉత్తర రామాయణము” Printed by Ananda Press, Madras. Published by Vemuru Venkata Krishnama Shetty and Sons, 1903.


పాపరాజు గారు 1790 సంవత్సర ప్రాంతమున ఈ కావ్యము రచించెనని బ్రహ్మశ్రీ వీరేశలింగము వారు చెప్పినారు. ఈ రెండు పద్యములు ‘హేమంత ఋతువు వర్ణన’ ఘట్టమున నుంచి ఉటంకించడమైనది (Page 213).   


కాచెను సిరికలు తఱుచుగ, బూచెం జేమంతి విరులు భూమికి బరువై
తో(చె ( జణకాది సస్యము, లేచెన్ బలుమంచు చదల హేమంతమునన్


కొండలెల్ల మంచుగొండలై కనిపించె, నడవులెల్ల బూచి నటుల మించె
దీవులెల్ల ( దెల్ల దివులై రహి గాంచె , మాపు రేపు మించు మంచువలన


With abundant amla fruits
And chrysanthemum blooms all over …
The earth seems heavy with chickpeas
In this Hemantha season
Many tents of fog ‘ve risen touching the sky
The hills look like snowy mountains
The forests appear as though in inflorescence
All the isles look like white (draw) wells
Due to the overwhelming
Coverage of (season’s) mist
During the nights and mornings


Copyright 2017 by the author for the English Translation