Telugu Translation of "दिल की बात लबों पर" Ghazal
ఎదలోని మాట పెదవులైపై తెచ్చి
ఇన్నాళ్ళు (ఇప్పటి దాక) బాధ సహించాను
విన్నాను ఈ ఊళ్ళో (పేటలో, నగరములో)
హృదయము ఉన్నవాళ్ళు కూడా ఉంటారని
ఎవరో నన్ను ఓ బాటసారి (దేశ దిమ్మరి) అంటే
పెద్ద అవమానము కాదు
లోకులు సహృదయుల్ని (సున్నిత మనస్కుల్ని) ఎన్నో అంటూ ఉంటారు
(అంటారు)
వర్ష ఋతువు వెళ్ళిపోయింది, కాలం తన చూపు త్రిప్పుకొంది (మార్చు కొంది)
వర్ష ఋతువు వెళ్ళిపోయింది, కాలం తన చూపు త్రిప్పుకొంది (మార్చు కొంది)
కాని
ఈ దాహార్తి చక్షువుల్లోంచి కన్నీరు కారుతోనే ఉంది ఇంకా
ఎవరి కోసం ఊరు కూడ వదిలానో,
ఎవరి కోసం అపకీర్తి పాలైనానో
వారే ఇప్పుడు (ఇవాళ) నాకు అనాప్తులైనారే! అపరిచితులైనారే!
ఇప్పుడు ఈ బాటలోంచి వెళ్ళాడు ఓ చింకి చొక్కా వాడు
(ఇప్పుడు ఈ బాటలోంచి వెళ్ళాడు ఓ భగ్న ప్రేమికుడు)
ఆ (బుడబుక్కల) ప్రేమికుణ్ణి (ప్రేమిక పథికుణ్ణి) అంటారు - "జాలిబ్" జాలిబ్
అని
అని
(I dedicate this translation piece to our dear 'తెలుగు తల్లి'
(The Mother of Telugu-ness); to the embodiment of sweet Telugu
language, the essence of refined Telugu culture, the
encapsulated history of more than two millennia, the
vast storehouse of classy music, and a rainbow-colored repertoire
of classics and modern works. Sadly the Telugu language
and Telugu teachers are going through tough times in the
current political climate there in India. What can I say, I sigh
in despair.
The original poet (Mr. Habib Jalib) gave form to all the
emotions of a true, sensitive, young lover. And of course
the incomparable vocalist (Mehdi Hassan) imparted a
soul and faithful form to this lyric. Though I did not get
a chance to meet either of them, I bow in reverence to
the exceptional creative artists. Luckily I learnt Hindi
and Urdu languages and their idioms during my stay
in Delhi. I hope my Telugu readers and Internet
friends will enjoy this post.) Copyright 2020 by the author