మాతృ గీతము
సంగీతము, సాహిత్యము
స్వరవీణాపాణి
పుట్టిన నేల తల్లి పాలిచ్చిన ముద్దుల తల్లి మాట
మాగాణుల నిచ్చిన తెలుగు తల్లి ఈ ముగ్గురి తీరు తెలుపగా
పుట్టిన గడ్డకు ఎదురునిల్చి సరితూగెడి స్వర్గము లేనె
లేదు ఆ మట్టికి మారుగా మనసుదోచెడి యంత్రము సృష్టి
యందు భూతద్దము వేసి చూసినను ఎచ్చట కానరాదు
స్పృసియించిన చాలు మట్టి నీకిచ్చెడి మధురమైన అనుభూతుల
పొరల తెరలు తొలగించుచు చూడు బాల్యమున ముద్దుగ బొద్దుగ
వచ్చిరాని వయ్యారపు నడకల పరుగు పరుగుతో బోసిగ
నవ్వు నింపుతూ బోలెడు మట్టి పెడ్డలను పప్పు చెక్కలుగ
గోడల మొత్తన దాగిదాగి ఫలహారముగా తిని ఉరుకు
పెట్టి ఆమట్టిలొ దొర్లిదొర్లి ఆటాడగ అలుపురాగ
ఆ గోడకు జారి నిద్రలో జోగినవేళ జన్మకిక రాదిక
రాదురాదు ఆ తీయని కమ్మని గుర్తులు పురిటిగడ్డపై
మట్టికి వాసనుండుట మహత్తరమైన సత్యమే దానిని
నిగ్గు తేల్చునది నీ మదిలో మమకార భంధమే ప్రాణము
లున్నవరకు నీ ఊరను పేరును కలువరించు ఆ భాగ్యమె
చాలుచాలు నీ మనసున నిండుగా పదిల పరచుటయే
పదివేలు కోటినీ జన్మలు కోరెడి పుణ్యభూమిలో పుట్టిన (1)
ధన్యజీవివై మేలుకు మేలు చేసెడి సమున్నత భావ
శీలివై కీడుకు కూడ మేలు ఒనరించెడి ధార్మిక బుద్ధి
శాలివై ఊరిని ఊరకనే తలవక ఉపకారము చేయు
ధ్యాసలో గర్వము వద్దు నీకు ఆ మట్టిని ముద్దిడు భాగ్యమె
చాలు జన్మలే చాలవు తీరని ఋణముల తీపి గుర్తులౌ
వింతలో వింత గాక పలుజన్మలు సాధ్యమె ఒక్క జన్మలో
బిడ్డకు జన్మనిచ్చు ప్రతికానుపు తల్లికి పునర్జన్మయే
అర్ధము కాని ఈ క్రియకు అదియు అంతము అమ్మ ఒక్కతే
సృష్టికి మూలమైన ఆ దేవుని చేతిలో బొమ్మ అమ్మ
ప్రతి సృష్టిని చేయగలట్టి సాధనా శక్తికి మారు రూపు
నీ తల్లికి సాటిలేరు లేరెక్కడ వేరెవరైన చూపగా
పాలుగ రక్తబిందువుల మార్చెడి మంత్రము అమ్మసొంతమే
కాదనకుండ లేదనక బిడ్డకు స్థన్యము నిచ్చి ధన్యతను
పొందెడి మాతృమూర్తి నీ జన్మకు కారణ కరుణ రూపమై
ధ్యానము చేయు ఎల్లపుడు ధ్యాసయు స్వాసయు బిడ్డకోసమే
ఓర్పుకు మారుపేరు ఓదార్పే ఇంటిపేరు ఔదార్యము
అసలు పేరు మమకారము ముద్దుపేరు అనురాగమె అమ్మ
పేరు అలుపెరుగని ఆత్మ స్థైర్యమునకు ధైర్యము నిచ్చెడి దిట్ట (2)
ధ్యానము చేయు ఎల్లపుడు ధ్యాసయు స్వాసయు బిడ్డకోసమే
ఓర్పుకు మారుపేరు ఓదార్పే ఇంటిపేరు ఔదార్యము
అసలు పేరు మమకారము ముద్దుపేరు అనురాగమె అమ్మ
పేరు అలుపెరుగని ఆత్మ స్థైర్యమునకు ధైర్యము నిచ్చెడి దిట్ట (2)
అమ్మ కనుసన్నల స్వార్థము శాస్వతంబుగా తిరుగుచునుండు
భూమిలా బిడ్డల యోగక్షేమమే ఆమెకు ముఖ్యము గనుక
జన్మనే ఇచ్చిన తల్లికి మాటతడయుగా ఇచ్చితి ఇచ్చితి
ననుచు గొప్పగా చెప్పిడి బిడ్డల పిచ్చి మాటలకు అర్థము
లుండున ఏ నిఘంటువును వెతికిన వెతికిన ఏమి ఫలితము
పుచ్చిన పుచ్చ కాయలో తీపిగ పుచ్చు కొనుటునే భావన
వున్న అమ్మ నువ్విచ్చెడి ప్రేమ మాత్రమే జీవిత కాలము
పుచ్చుకొనుతకే పుట్టితి నన్న కన్న ఆ తీపికి రుచిని
చెప్ప ఏ దేవుడు నోరు మెదుపునో లెక్కకు ఒక్కడుండునా?
పుట్టుక నుండి నోరుగల జీవివి మాత్రమె మూగి మొద్దువే
భాషలతల్లి జాలిపడి తెలుగును ఉగ్గుపాలలో కలిపిన
భాగ్యమె నేడు నీకు ఈ మాటల పుట్టలు తేనె పట్టులుగ
తీపి గుట్టలై హాయిన తెలుగుతల్లి పదసంపద చెట్టుకు
ఊగు ఊయలై, కోయిన కూతలంటి కులుకైన కవిత్వపు
కన్నె సొగసులై, పద్యపు, గద్యపు నృత్యలయల సంగీతపు
సుస్వర వీణాపాణియై హరికధ బుర్ర కధలుగా అద్భుత
దృశ్య శ్రవణ కావ్యాలకు మాటల ఊటల మోటబావులై
భాషకు అసలు సిసలైన యాసల ఊసుల ప్రౌఢకాంతయై (3)
చక్కిల గింతల జానపదాలకు కిన్నెరసానుల పల్లె
కాంతులై అవనిలోనె అలరారెడి భాషల తెలుగు మిన్నయై
భూమికి హక్కులైన నలు దిక్కుల పెట్టున నీకు ఖ్యాతి
నందించిన తెలుగుతల్లి నీకీయని దెక్కడ దాచుకున్నది?
తీయని తెలుగుజాతికే సేవల గొప్పలు వద్దు వద్దు
నీ బ్రతుకుకె వెలుగునిచ్చు పద సంపదకే ప్రతి రోజు మ్రొక్కుతూ
ముగ్గురు తల్లుల ఋణము తీర్ప నీ జన్మల జన్మలు వేయి
చాలునా పొట్టను చేతబట్టుకొని ఆకలి ముద్దల బార
సాలకై రియ్యున రియ్యుమంటు శరవేగముతో పయనించు
బాటసారెక్కడ? రెక్కలు ముక్కలు చేసుకొనుచునూ పట్టిన
చెమట బిందువులలో తన తల్లులుగా ప్రతిబింబ రూపముల
చూచుచు అక్కున చేర్చుకొనెడి ఆనందము నొందుచు నుండు
గుండె గాయాలకు ప్రేమను వెన్నరాసి తడియారని కన్నుల
తీపిజ్ఞాపకాలన్నిటి నెమరువేసుకొని నిత్యము నూతన
శక్తి పొందుతూ బంగరు భవితకు నాంది పలుకుతూ అనితర
సాధ్యమైన విజ్ఞనపు ఊడల మఱ్ఱి చెట్టువై నీతి
నియమ సూత్రాలకు ఉత్తమ మాలరూపమై ముందుకుసాగు
సాహసికి సర్వము సాధ్యము శ్రీకర శుభములు అన్ని వేళలా (4)

(Recently Sri Swaravinapani has composed this unique Telugu lyric which contains all the 72 Melakarta ragas in a single song. He has been going around many Indian cities giving music performances. Many years ago Dr Balamuralikrishna composed songs in all the 72 Melakarta ragas. The Telugu community, now spread over all the continents is immensely fortunate to have these very talented musicians. It is rare these days to have individuals who can sing, compose, and write lyrics single handedly. Really speaking none can excel the legendary music giants like Annamayya. Perhaps nowhere in the world can one find such a humongous treasure trove of sublime music and profound literature. Music just came down from heavens like a majestic waterfall filled with the aroma of kewra - that is real creation! English translation of this song will be given in the next blog.)
Copyright of the Telugu song, tune, and music is vested with Swaravinapani 2015
Copyright of the Telugu song, tune, and music is vested with Swaravinapani 2015