Thursday, September 22, 2016

శిశిరాగమనము

శిశిరాగమనము

శిశిరం వస్తోంది
వస్తోంది చల్ల చల్లగా, చడీ చప్పుడు లేకుండా
ఇంకా వాళ్ళ అన్నయ్య
సన్నాయి బాకాలు శ్రుతి చేసుకోలేదు
ముస్తాబుకి రంగుల బండి రాలేదు
కాని నాలంటి కవులు
చూచారు, లేదు గమనించారు
నీ అందచందాలు, నీ ముగ్ధ మనోహర  
లావణ్యం, నీ దొంగ చూపులు
నిన్న వాహ్యాళినుంచి వస్తుంటే
రెండు చిన్ని చిన్ని ముద్దు ముద్దు  
పట్టు ఈకలు కనిపించాయి -
ఆప్పుడే ప్రవాస పక్షులు బయలు దేరాయా?
ఒక ఎఱ్ఱ మేపల్ చెట్టంతా
కందిపోయింది! పోదా మరి
వాళ్ళాయన రాత్రంతా ముద్దాడితే?
అందులోనూ చలి దుప్పట్లో దూరి దూరి
రావోయి
నా ప్రియాతి ప్రియ
సుందర స్వప్న గాంధర్వ బాల
ఏమి అదృష్టం ఏమి భాగ్యము
గోదారి పాలపిట్ట లేదని బాధ లేదు
నిన్న నీలపిట్ట కూసింది నన్ను చూచి -
మంచి ఠీవిగా కిరీటంతో
పిలుస్తోంది వాళ్ళ రాగాల చెలికత్తెని
“తీ, తీతి, తీతి
మధ్యన ఎక్కడికి పోయాయి
మా ఉడుతలు?
మా నల్ల, బూడిద, ఎఱ్ఱ బొద్దు ఉడుతలు?
ఇప్పుడు మస్తుగ అక్రోటులు మెక్కుతున్నాయి
కీ కీ అని అరుస్తూ. నేను కూడా అరిచాను
వాటికి తోడుగా
అన్నపూర్ణ శిఖరాగ్రము చూడలేదు
నంగాపర్బత్ ఎక్కలేదు
కైలాసమునకు ఎగరలేదు - అన్ని అందాలు సొగసులూ
నా దగ్గరకు వచ్చాయి. ఇంక మా దసరాకు
చేమంతి పూలే పూలు, రా నా
ముద్దుల ప్రకృతి బాల - ఇక నిన్ను 
సింగారిస్తా ఆపాదమస్తకము,
రమ్మను మీ ప్రభంజన సోదరుని
కదలమను ఉత్తర ధృవం నుంచి 
తీస్తాను నా కశ్మీరు శాలువా
ఉన్ని కుచ్చుల టోపీ

© 2016 తె. వె. రావు  

No comments: