Thursday, June 15, 2023

కరోనా ఘాతము (Corona's Blow) - A Telugu Poem on Corona


కరోనా ఘాతము (కవన వీడ్కోలు)


లేదు 

ఇప్పుడు ఇనగంటి (ఇనకంటి) కుటుంబం లో 

మా సూరీడు 

ఎప్పుడూ నిండు మొగముతో, తెల్ల జుత్తుతో

పెన్సిల్ మీసముతో, తెల్ల చొక్కా పైజమా వేస్తే 

గుల్జార్ లా ఉండేవారు  

నవ్వుతూ మాట్లాడు కొనేవాళ్ళం

ఉద్వేగ భరిత వాదోపవాదాలు

జోకులు, అప్పుడప్పుడు నన్ను

ఆట పట్టించే వారు

అంతలోమర్చిపోయే వాళ్ళం 


ఇప్పటికి

కళ్ళలోజ్ఞాపకాలు సినిమా బొమ్మాల్లా

కదుల్తాయి -

శ్రీశైలములో కరివేన సత్రములో 

కలిసి భోంచేయడం

పెళ్ళికి ముందూ, పెళ్ళికి తర్వాత కూడా 

చాలా సార్లు నాగపూర్ స్టేషన్లో బండి ఎక్కించడమూ 

లేని రిజర్వేషన్లు, బెర్త్ సృష్టించడమూ మా ‘భైయా’ కే సాధ్యము 

ఎన్ని విషయాలు చర్చించుకునే వాళ్ళము -

ముళ్ల మొక్కలు దగ్గర్నుంచి, రాజకీయాలు, విజ్ఞానము 

ఆరోగ్య శాస్త్రము, సాహిత్యము 

ఎక్కడ దొరుకుతారు - అటువంటి అపురూప వ్యక్తి?

నాల్గు భాషలు క్షుణ్ణముగా ఎవరికి తెలుసు ఈనాడు?

ఎవరితో మాట్లాడ గలము ఇప్పుడు 

నాగపూర్ పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి

ఎవరికి అర్ధ మవుతాయి? ఈ నిగూఢ రహస్యాలు 

ప్రపంచంలోనే మహా ఉంటే పదిమంది ఉంటారు


మీ ఆత్మ

ఇప్పుడు ఎక్కడ ఉన్నా 

పరమ శాంతి సుఖాలతో సుందర ఉద్యానవనాల

ఫల పుష్ప రసాల పిక కపూత శ్రేణి భరిత లతా కుంజములలో

పచ్చపొలాల మధ్య నదీ ప్రవాహాల లాహరిలో సఖులతో 

ఆనంద డోలికలలో 

విహరించుగాక 

తదుపరి -

“అహం బ్రహ్మాస్మి” సిద్ధి కల్గు గాక!


Copyright 2020 by the author

English Translation of this poem was posted here at Corona's Blow



No comments: