Monday, November 3, 2025

Defunct (Poem)

లేదు (Defunct)


లేదు 

భయము, భక్తి,

గౌరవము 

మనుషలకి, మర్యాదలకి, సాంప్రదాయాలికి 

దేని మీద (నిజమైన) ప్రేమ, అనురాగత లేదు 

లేదంటే లేదు, ఇది పచ్చి నిజం 

ఉన్నదంతా ఇక్కడ, ఇప్పుడు

గడ్డ కట్టిన, బిగిసి పోయిన 

సాంద్రమైన “అహం”, పనికిమాలిన 

“ఇజం” అంతా "నా సామ్రాజ్యం 

నా డబ్బు, దస్కం, నా పనికిమాలిన 

అభిప్రాయలు, అపోహలు!"


తెలియదు పాపం, తెలియదు 

ఈ ఆజ్ఞానులకి, 

తెలియదు

ఈ మూఢులకి

ఇదంతా వట్టి భ్రమ అని

మూన్నాళ్ళ ముచ్చటని, నువ్వు

చేసిన పిసినంత మంచి తప్ప (?)

ఏది నిలవదు, ఏది శాశ్వతం కాదు

నీతో ఏదీ రాదు

కరోనా పెను తెగులుతో నేర్చుకోలేదా?

నువ్వు మిగిల్చిన మంచి(తనము),

మధుర జ్ఞాపకాలు

మనిషి అంటే -

ఆ తత్త్వవేత్త అన్నది నిజం:

"మన నడక ఎల్లప్పుడూ

ఒక గ్రద్ద పయనంలా ఉండాలి.

ఏ మచ్చ ఉండ రాదు. జెట్ ప్లేన్ లా

తన చేవ్రాలు మిగిల్చ రాదు!"

కబీర్ దోహా మరచి పోయావా?

సుపుత్రుడికోసం డబ్బు ప్రోగు చెయ్యడం ఎందుకు? 

కుపుత్రుడికి  డబ్బు ఎంత మిగిల్చినా ఎమి

లాభం?

“तेन त्यक्तेन भुञ्जीथा /”मा गृधः”   © అత్రి

 


Defunct


No, there’s no

Fear, devotion, or respect

No concern

For people, norms, or traditions;

There’s no real love or affection

Now there is nothing - 

This is the real truth

Whatever is here, now 

Is

Frozen, fossilized

Dense “egotism”; useless

“Ism” 

Everything is “mon royaume”

"My assets, my belongings

My useless opinions and false premises"


Alas, (they) don’t know

These ignoramuses

Don’t know; it’s beyond their comprehension

That

“This is all is pure illusion,

Is simply very temporal, transitory”

Nothing endures except - 

A few good deeds

Nothing lasts, nothing is lasting

No-thing accompanies you 

Haven’t you learnt from the Covid?

Only your sweet memories

And your goodness - 

What that philosopher said

Is true:

“Our movement (thinking) must always

Be like the eagle’s flight. Must not leave any trace.

Shouldn’t leave a signature like 

The jet plane!”

Have you forgotten Kabir’s couplet?

Why accumulate riches for a good son?

And it’s

No use leaving monies for a bad

Offspring

“Merely enjoy what’s apportioned for you/

do not usurp others’ things”

© by the author 2025


(The poem was penned in utter anguish and profound sadness.

It was initially triggered by a 'serious adulteration' - but later a

series of global events have grievously scorched the human soul.

This piece isa humble attempt to record contemporary society

and its struggles.)


No comments: