Tuesday, December 8, 2020

Lyrics of "e peruto ninu" - Original Devotional Song

పేరుతో నిను పిలిచెదనో
రూపమున నిను కొలిచెదనో, సాయి
తెల తెల్లని నవ తామరలతో
నిత్యము వెలిగే నీ ద్వారములు  | పేరుతొ

1. చిన్ని చిన్ని వరములు, చిల్లర కోర్కెలు
అంతములేని మా ఆవేదనలు
నిమిసమైనా మది నిలకడ నొసగే
చల్లని నీ కృపయే కాదా 

2. కలిమిలేముల కష్టపు బ్రతుకులు
దినదిన గండపు దీర్ఘాయువు
ప్రారబ్ధమో లేక పరుల శాపమో యిది
రోగ పీడిత తనువులు మావి
ఖండ ఖండములలో తల్లడిపోయే
అగణిత కోటి జీవరాసులు
మరువకు మరువకు మరి మమ్ములను
మరువకు సుమా నీ దాసులము 

3. (నా) జపములు తపములు వ్యర్ధములా
స్వచ్ఛపు హృదయమె నిను కనుగొనునా
నిను చేరుటకై తపనేల
నిష్ఫల యత్నము సేయనేల
(నా) సాధన సంగీత కవితలెల్ల
నీ మహిమల సుమ నిహారమె కాదా

ae paerutO ninu pilichedanO

ae roopamuna ninu kolichedanO, saayi

tela tellani nava taamaralatO

nityamu veligae nee dvaaramulu  |ae paeruto| 


1. chinni chinni varamulu, chillara kOrkelu

aMtamulaeni maa aavaedanalu

nimisamainaa madi nilakaDa nosagae

challani nee kRpayae kaadaa 


2. kalimilaemula kashTapu bratukulu

dinadina gaMDapu deerghaayuvu

praarabdhamO laeka parula SaapamO yidi

rOga peeDita tanuvulu maavi

khaMDa khaMDamulalO tallaDipOyae

agaNita kOTi ee jeevaraasulu

maruvaku maruvaku mari mammulanu

maruvaku sumaa nee daasulamu 


3. (naa) japamulu tapamulu vyardhamulaa

svachChapu hRdayame ninu kanugonunaa

ninu chaeruTakai tapanaela

nishphala yatnamu saeyanaela

(naa) saadhana saMgeeta kavitalella

nee mahimala suma nihaarame kaadaa


(When I get a chance I will record the song and upload it to my YouTube channel. Still, people can add their own tune and utilize it as a bhajan song. It suddenly came to me out of a sudden inspiration. Obviously there are many beautiful, moving, and profound devotional songs on the Guru. Hope people will add this to their repertoire of devotional songs. Years ago I posted the lyrics at Sulekha, if I remember correctly. English translation will be given in the next post here. Copyright 2020 by the author.) 

No comments: